ENTERTAINMENT

మాస్ లుక్ దేవ‌ర ట్రైల‌ర్ అదుర్స్

Share it with your family & friends

జూనియ‌ర్ ఎన్టీఆర్ సూప‌ర్ షో

హైద‌రాబాద్ – డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన దేవ‌ర మంగ‌ళ‌వారం ట్రైల‌ర్ విడుద‌లైంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి ఈ మూవీపై.

ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది దేవ‌ర మూవీ ట్రైల‌ర్ ను చూసి. ఏ పాత్ర‌లోనైనా ఇమిడి పోయే ద‌మ్మున్న న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్. తొలిసారిగా దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు , అందాల ముద్దుగుమ్మ జాహ్న‌వి క‌పూర్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తోంది.

మాస్ లుక్ తో ఎన్టీఆర్ రెచ్చి పోతే, డైలాగులు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇక ప్ర‌తి సీన్ లో త‌న‌దైన మార్క్ ను క‌న‌బ‌ర్చేలా చేశాడు కొర‌టాల శివ‌.ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్ కు కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

విస్తు పోయే సీన్స్, అద్భుత‌మైన పోరాట స‌న్నివేశాలు..సినిమా అంత‌టా ర‌క్త‌పాత‌మే క‌నిపించేలా చేశాడు ద‌ర్శ‌కుడు. కొర‌టాల శివ ఏం చెప్ప‌ద‌ల్చుకున్నాడ‌నేది వేచి చూడాల్సిందే. ట్రైల‌ర్ ఇంత‌లా ఆక‌ట్టుకుంటే ఇక సినిమా విడుద‌ల‌య్యాక ఎన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంద‌నేది వేచి చూడాలి.