ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర
నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు
విజయవాడ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మంగళవారం పర్యటించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విజయవాడ బాధితుల కోసం ఎవరికి తోచిన పని వారు తమ పరిధిలో సాయం చేశారని అన్నారు.
అయితే సైకో జగన్ రెడ్డి మాత్రం ఏకంగా ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని కుట్ర పన్నారని, దీని ద్వారా విజయవాడను ముంచెత్లేలా చేసి..లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
గతంలో జగన్ చేసిన నిర్వాకాల కారణంగా ఏపీ సర్వ నాశనం అయ్యిందన్నారు. జగన్ రెడ్డి జాతికి ద్రోహం తలపెట్టేందుకు ప్రయత్నం చేశాడని మండిపడ్డారు.
తమను అధికారంలో లేకుండా చేసినందుకు కక్ష పెట్టుకున్నాడని ఆరోపించారు ఏపీ సీఎం. ఏకంగా ప్రజలను టార్గెట్ చేశాడని మండిపడ్డారు. నేరస్తులు రాజకీయ రంగు వేసుకుని తిరుగుతున్నారని, వారికి ఎలా బుద్ది చెప్పాలో తనకు బాగా తెలుసని హెచ్చరించారు.