అమ్మ వారి సన్నిధిలో సాయి ధరమ్ తేజ్
శాంతించాలని ప్రార్థించానన్న నటుడు
విజయవాడ – ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ బుధవారం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు సాదర స్వాగతం పలికారు నటుడికి. అమ్మ వారిని దర్శించు కోవడం అనేది ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. పూజారులు సాయి ధరమ్ తేజ్ కు ఆశీర్వచనాలు అందజేశారు. కనకదుర్గమ్మ అమ్మ వారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని నటుడికి ఇచ్చారు.
కనక దుర్గమ్మకు పూజలు చేసిన అనంతరం సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. అమ్మ వారి దయ వల్ల వరదలు శాంతించాయని , ఆమె కృప కారణంగానే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్ల లేదన్నారు.
ఇప్పటికీ ఏపీ తీవ్ర ఇబ్బందులో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనక దుర్గమ్మ చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, అందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో బాగుండాలని, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మ వారిని ప్రార్థించినట్లు తెలిపారు నటుడు సాయి ధరమ్ తేజ్.