SPORTS

ఈసారైనా సంజూకు ల‌క్ క‌లిసొచ్చేనా

Share it with your family & friends

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కోచ్ గా ద్ర‌విడ్

హైద‌రాబాద్ – అద్బుత‌మైన ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాడిగా గుర్తింపు పొందారు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. ప్ర‌తీసారి త‌న‌ను అదృష్టం త‌లుపు త‌ట్టినా చివ‌ర‌కు నిరాశ చెందేలా చేస్తోంది. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి జ‌ట్టుకు కీల‌కంగా ఉన్న మాజీ క్రికెట‌ర్ కుమార సంగ‌క్క‌ర హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇది బిగ్ షాక్ త‌గిలేలా చేసింది.

ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం కీల‌క స‌మావేశమైంది. ఈ మేర‌కు భార‌త జ‌ట్టుకు హెడ్ కోచ్ గా వ్య‌వ‌హ‌రించిన రాహుల్ ద్ర‌విడ్ ను ఏరికోరి ఎంపిక చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో సుదీర్ఘ అనుబంధం క‌లిగి ఉన్నాడు సంజూ శాంస‌న్ ..కుమార సంగ‌క్క‌ర మ‌ధ్య‌.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును అత్యంత బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. మ‌రో వైపు భార‌త జ‌ట్టులోకి ఎంపికైనా తుది టీమ్ లో ఆడించ‌కుండా రాహుల్ ద్ర‌విడ్ ఇబ్బంది పెట్టాడ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

మొత్తంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మాత్రం సంజూ శాంస‌న్ ను త‌మ స్వంత ఇంటి స‌భ్యుడిగా ప‌రిగ‌ణిస్తోంది. ఈ త‌రుణంలో ద్ర‌విడ్ రాకతో శాంస‌న్ లో మార్పు వ‌స్తుందా అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.