NEWSANDHRA PRADESH

అబ‌ద్దాలు ఆడ‌డంలో జ‌గ‌న్ నెంబ‌ర్ వ‌న్

Share it with your family & friends

ఏపీ మంత్రి స‌త్య ప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్

అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గుంటూరు జైలు వద్ద జగన్ తీరు చూసిన ప్రజలు ఆ 11 సీట్లు మాత్రం ఎందుకు ఇచ్చామ‌ని బాధప‌డుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

మోసం జ‌గ‌న్ నైజ‌మ‌ని, నిత్యం అబ‌ద్దాల‌తోనే బ‌తుకుతున్నాడ‌ని మండిప‌డ్డారు. జగన్ అబద్దంతో జన్మించాడు…..ఫేక్ తో పెరిగాడు….అసత్యాలతో రాజకీయ జీవితం సాగిస్తున్నాడ‌ని అన్నారు.

ప్రతి రోజూ రుజువు చేసుకుంటున్నాడ‌ని సెటైర్ వేశారు అన‌గాని సత్య ప్ర‌సాద్. దేశంలో సిఎం గా చేసిన ఎవరూ కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పలేరని…బురద రాజకీయం చేయలేరని అన్నారు.

బుడమేరు ఎక్కడ ఉంది….బుడమేరు డైవర్షన్ కెనాల్ఎ క్కడ ఉంది…..రెగ్యేలేటర్ ఎక్కడ ఉంది..గండ్లు ఎప్పుడు ఎక్కడ పడ్డాయి..కృష్ణా నదీ ప్రవాహాలు ఎలా వచ్చాయి అనేది కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

మొన్నంటే తెలియక ఏదోదే అన్నాడు అనుకోవచ్చు…కానీ మళ్లీ అదే రాగం తీశాడు అంటే….జగన్ ఒక ఫేక్ ను పట్టుకుని దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు.

తెలుగు దేశం పార్టీ కార్యాలయం పై దాడిని కూడా సమర్థించుకునే నీచమైన వ్యక్తి ఒక మాజీ సిఎం అని చెప్పుకోవడానికి కూడా బాగోలేదని అన్నారు. జనం కష్టాల్లో ఉంటే…జైలుకు వెళ్లి క్రిమినల్ ను పరామర్శించే జగన్ కు తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు.

6 లక్షల మంది వరదలో చిక్కుకోవడానికి జగన్ చేసిన పాపాలే కారణమని, ముందు దానికి జగన్ ప్రజలను క్షమాపణ కోరాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.