NEWSANDHRA PRADESH

వ‌ర‌ద నీరు బ‌య‌ట‌కు వెళ్లేలా ఏర్పాట్లు

Share it with your family & friends

ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ

విజ‌య‌వాడ – ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలలో ప‌ర్య‌టిస్తున్నారు. వ‌ర్షాల కార‌ణంగా పెద్ద ఎత్తున పారిశుధ్యం పేరుకు పోయింది. వ‌ర‌ద నీరు బ‌య‌ట‌కు పంపించేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. వీటిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు మంత్రి నారాయ‌ణ‌.

అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటికి పంపించేందుకు 7 గండ్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు .

నీటి పంపింగ్ పనులను పర్యవేక్షించ‌డం జరిగింద‌న్నారు మంత్రి నారాయణ. ఇదిలా ఉండ‌గా ఎంపీ కేశినేని శివ నాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మంత్రి నారాయణ కుమార్తె సింధూర తో క‌లిసి ప‌నుల‌ను ప‌రిశీలించారు.

కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గి పోయింద‌ని చెప్పారు. మ‌రో కొన్ని గంటల్లో మొత్తం నీరు బయటికి వెళ్ళి పోయేలా ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.

వరద తగ్గిన అన్ని ప్రాంతాల్లో శానిటేషన్ కూడా పూర్తి కావస్తుందని చెప్పారు. వై నాట్ 175 అన్న పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వ లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి. కనీసం 10 శాతం సీట్లు రాని వ్యక్తి సీఎం పై విమర్శలు చేయ‌డం దారుణంగా ఉంద‌న్నారు.

జగన్ ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళ లేద‌ని, వారి బాధలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్నారు పొంగూరు నారాయ‌ణ‌. త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబును విమ‌ర్శించే నైతిక హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేద‌న్నారు.