ఛార్జిషీట్ ను ఖండించిన నటి హేమ
నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు
హైదరాబాద్ – బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. గురువారం బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్ ను సమర్పించారు. ఈ ఛార్జిషీట్ లో నటి హేమ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆమె ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమ గురించి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ కూడా జత చేశారు. మొత్తం కేసుకు సంబంధించి 80 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ముందు నుంచీ తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ వస్తోంది నటి హేమ. తాజాగా ఛార్జిషీట్ సమర్పించిన దాంట్లో తన పేరు ఉండడంపై స్పందించారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇప్పుడే ఛార్జిషీట్ లో తన పేరు వచ్చినట్లు తెలిసిందన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దం అని ప్రకటించారు నటి హేమ. తనకు ఇంకా నోటీసులు అందలేదని, వచ్చాక తాను స్పందిస్తానని తెలిపారు. తనకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగటివ్ అని వచ్చిందని దీనికి తాను డ్రగ్స్ ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు నటి హేమ.
ఇదిలా ఉండగా మొత్తం 1086 పేజీలతో ఛార్జిషీట్ ను దాఖలు చేయడం విశేషం. ఇందులో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు.