బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది
ఏపీ మంత్రి నిమ్మల రామా నాయుడు
విజయవాడ – ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియను పరిశీలించారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బోటుకు లోపలి వైపు రెండు పేట్లు ఉండడంతో కటింగ్‌కు ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు.
బోట్ల వెలికితీతలో ఏదో ఒక అంతరాయం వస్తుందన్నారు. ఇప్పటికే కాకినాడ, విశాఖ నుండి రెండు టీంల డైవర్స్ సాయంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
బోట్లను లాగడానికి సాయంత్రం నుండి కాకినాడకు చెందిన అబ్బులు టీం ను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. బోట్లను బయటకు తీయడానికి అన్ని రకాల ప్రయాత్నాలూ చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు.
తొలగింపు ప్రక్రియ పూర్తి అయ్యేందుకు కనీసం రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
భవిష్యతు లో వరద , పట్టి సీమ నీళ్లు వెళ్లేలా , సీపేజ్ ను అరికట్టేలా బండ్ ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు నిమ్మల రామా నాయుడు.
రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35 వేల క్యూసెక్కులు నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయని అనే పేరు లేకుండా చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్బంగా సందర్శించిన సెంట్రల్ టీమ్ కు బుడమేరు కు పడిన గండ్లు, జరిగిన నష్టాన్ని వివరించారు మంత్రి.