NEWSTELANGANA

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కేసు న‌మోదు

Share it with your family & friends

ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హైద‌రాబాద్ – శేరి లింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గాంధీపై ఫిర్యాదు చేశారు. అరికెపూడి గాంధీతో పాటు ఆయ‌న అనుచ‌రులు శ్రీ‌కాంత్, గౌత‌మ్ గౌడ్, రాంపంల్లి వెంక‌టేశ్, రాములు, న‌రేశ్, శివ‌, మంజుల‌, రాధిక‌, చంద్రిక గౌడ్, నాగేంద‌ర్ యాద‌వ్ రంగం, వెంకటేశ్ గౌడ్, అశ్ర‌ఫ్, ర‌ఘునాథ్ రెడ్డి, మోహ‌న్ గౌడ్, త‌దిత‌రుల‌పై కేసు న‌మోదు చేశారు.

109(1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2), రెడ్‌విత్‌ 190 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. దాడికి పాల్పడిన గాంధీ, అతడి అనుచరులపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన అరికెపూడి గాంధీ కావాల‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌యత్నం చేశార‌ని, ప‌క్కా ప్లాన్ తోనే దాడికి దిగారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మ‌రో వైపు శుక్ర‌వారం గాంధీ ఇంటికి వ‌స్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .