సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ

డిసెంబర్ లో జ‌రిగే రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్ కు రావాలి

హైద‌రాబాద్ : విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైద‌రాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప‌లు అంశాల‌పై ఇరువురు చ‌ర్చించారు. త‌మ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైద‌ని, వెంట‌నే ఇన్వెస్ట్ చేయాల‌ని సీఎం త‌న‌ను కోరారు. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ,బ్యాటరీ నిల్వ, పునరుత్పాదక శక్తి , భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను పరిశీలిస్తుందని తెలిపారు సీఎం. డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనమని రాష్ట్రం తరపున ఫామ్ సాన్ చౌ, విన్‌గ్రూప్ చైర్మన్ శ్రీ ఫామ్ నాట్ వుయాంగ్‌లకు అధికారిక ఆహ్వానాన్ని అందించిన‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌న్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే తెలంగాణ రైజింగ్ లో ఉంద‌ని, దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు సీఎం. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, త‌దిత‌ర రంగాల‌లో హైద‌రాబాద్ వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టే వారికి తాము ఎర్ర తివాచీ ప‌రుస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *