సానియా మీర్జా కంటతడి
విడాకులు ఇచ్చిన భర్త మాలిక్
హైదరాబాద్ – ప్రపంచంలో పేరు పొందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆమె ఏరికోరి పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. వీరి వివాహం 2010లో జరిగింది. పెళ్లి కంటే ముందు ఓ మూడు నెలల పాటు డేటింగ్ చేశారు.
చివరకు కొన్నేళ్ల పాటు కలిసి మెలిసి ఉన్నప్పటికీ గత కొంత కాలం నుంచి పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. సానియా మీర్జా , షోయబ్ మాలిక్ విడి పోతున్నారని. చివరకు మొన్న మాలిక్ సోషల్ మీడియా వేదికగా తాము ఇద్దరం విడి పోయామని, ప్రస్తుతం తాను నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు.
దీంతో షాక్ కు గురైంది సానియా మీర్జా. ఇన్నేళ్ల బంధానికి తెర దించడంపై ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ అభిమానులు మండి పడుతున్నారు. కష్ట కాలంలో అండగా నిలవాల్సిన షోయబ్ మాలిక్ ఇలా ఒంటరిగా వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా సానియా చెల్లెలు ప్రముఖ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహమ్మద్ అజహరుద్దీన్ తనయుడిని పెళ్లి చేసుకుంది. ఆమె తన భర్తను వదిలి పెట్టింది. మొత్తంగా సానియా మీర్జా కంటతడి పెట్టడం ప్రస్తుతం వైరల్ గా మారింది నెట్టింట్లో.