NEWSANDHRA PRADESH

వైసీపీ మాజీ ఎంపీ రూ. 25 ల‌క్ష‌ల విరాళం

Share it with your family & friends

పోస్ట్ ద్వారా సీఎం స‌హాయ నిధికి డీడీ

అమ‌రావ‌తి – ఏపీలో చోటు చేసుకున్న వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ‌ర‌ద బాధితుల స‌హాయర్థం భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు వైసీపీ మాజీ ఎంపీ మేక‌పాటి రాజ మోహ‌న్ రెడ్డి.

నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు అయిన మేక‌పాటి రాజ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విరాళాన్ని డీడీ రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేశారు.

గతంలో ఇరు రాష్ట్రాలకు రూ.25 లక్షల వంతున మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ.25లక్షలు డీడీని సీయం సహాయ నిధికి స్పీడ్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి మాట్లాడుతూ విజయవాడలో వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులను తమ వంతుగా ఆదుకునేందుకు ఈ సహాయం అంద చేశామని తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, ఇతర స్వచ్చంధ సంస్థలు ముందుకొచ్చి మళ్లీ విజయవాడ వాసులు సాధారణ స్థితికి వచ్చే పూర్తి సహకారం అందించాలని కోరుతున్నామని అన్నారు.