NEWSTELANGANA

తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ పాల‌న – హ‌రీశ్ రావు

Share it with your family & friends

ఇలాంటి నిర్బంధాలు ఎన్న‌డూ చూడ‌లేదు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ పాల‌న కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రకమైన అణచివేతలను, నిర్భంధాలను చూడ లేద‌న్నారు హ‌రీశ్ రావు.
ఎమర్జెన్సీని మించిన పాలన రాష్టంలో నడుస్తోంద‌న్నారు.

పదేండ్ల కేసీఆర్ నాయకత్వంలో క్రమ శిక్షణతో ఉన్న అరికెపూడి గాంధీ, దానం నాగేందర్.. రేవంత్ నాయకత్వంలో రౌడీల్లా రెచ్చి పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నిన్న గాంధీకి పైలెట్ వాహనం, అడిషనల్ డిసీపీని ఎస్కార్ట్‌గా ఇచ్చి, ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయించారని ఆరోపించారు.. మీ లా అండ్ ఆర్డర్ నిన్న ఎక్కడ ఉందని ప్ర‌శ్నించారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

మీరు సక్రమంగా పని చేసి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేదా అని నిల‌దీశారు మాజీ మంత్రి. 16వ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి తెలియ చేశామ‌ని, క‌నీసం పూర్తి వివ‌రాలు చెప్పే ప్ర‌య‌త్నం సీఎం చేయ‌లేద‌ని ఆరోపించారు.

నోటికి వ‌చ్చిన‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడ‌ని, అయినా స‌హ‌నంతో ఉన్నామ‌ని చెప్పారు. తెలంగాణ పోలీసులకు స‌హ‌క‌రించామ‌ని , కానీ తాము దాడుల‌కు దిగ‌లేద‌ని పేర్కొన్నారు. దాడికి ప్ర‌తిదాడి మంచిది కాద‌ని మౌనంగా ఉన్నామ‌న్నారు.