కేంద్ర మంత్రికి టీజీపీడబ్ల్యూయూ లేఖ
వెల్లడించిన ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) జీఎస్టీ వర్తింపును సమీక్షిస్తూ ప్రభుత్వ అధికారులకు లేఖను సమర్పించింది. ఈ విషయాన్ని టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు, ప్రముఖ డ్రైవర్ షేక్ సలావుద్దీన్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) గిగ్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు సంబంధించిన మొబిలిటీ, రైడ్-హెయిల్ , వ్యక్తిగత సేవలను మధ్యస్తం చేసే ప్లాట్‌ఫార్మ్‌లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) వర్తింపునకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించేందుకు ఒక అధికారిక లేఖను సమర్పించిందని తెలిపారు.
ఇటీవల రాజస్తాన్‌లో గిగ్ , ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు సామాజిక సంక్షేమం కోసం చట్టాల అమలు, అలాగే కర్ణాటకలో జరుగుతున్న చర్చలు దీనికి పునాదిగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, కేంద్ర ప్రత్యక్ష పన్నులు , సుంకాల బోర్డు చైర్మన్, అలాగే హైదరాబాద్ GST & కస్టమ్స్ ప్రధాన కమిషనర్ వంటి కీలక ప్రభుత్వ అధికారులకు లేఖలు పంపించడం జరిగిందన్నారు షేక్ సలావుద్దీన్.
TGPWU, ప్లాట్‌ఫార్మ్ ఆర్థిక వ్యవస్థలోని వ్యాపార మోడళ్ళపై స్పష్టత, సామాజిక భద్రత (CoSS) కోడ్‌తో వీటి సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన విషయాలను నొక్కి చెప్పిందని తెలిపారు
- ప్లాట్‌ఫార్మ్ వ్యాపార మోడళ్ళలోని ఆదాయ ప్రవాహాల విధానాలు , GST వర్తింపుతో వాటి సంబంధం.
- గిగ్ , ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిధుల సమీకరణలో GST ప్రభావం.
- గిగ్ వర్కర్ల కోసం కొత్త సామాజిక సంక్షేమ చట్టాలు , ప్రస్తుతం ఉన్న పన్ను వ్యవస్థల మధ్య సరైన పొరపాటు లేకుండా ఉండేలా చూడడం.
TGPWU వ్యవస్థాపక అధ్యక్షుడు షైక్ సలాహుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “గిగ్ , ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు మెరుగైన సామాజిక భద్రతా నిబంధనల దిశగా ప్రయాణం కొనసాగుతున్నందున, పన్ను వ్యవస్థ కూడా వీటికి అనుగుణంగా మారడం చాలా అవసరమని పేర్కొన్నారు. సమీక్షలోని వ్యాపార మోడళ్ల అవగాహన, కొత్త చట్టాల కింద వ్యాపారాలు, కార్మికులు సమానంగా లాభపడేలా చూడటానికి కీలకమైనవి” అని స్పష్టం చేశారు.
TGPWU సంబంధిత అధికారులతో కలిసి మరింత పరిశోధనను పంచుకోవడానికి , సామాజిక సంక్షేమ కార్యక్రమాల నిధులపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు షేక్ సలాహుద్దీన్.