NEWSTELANGANA

సీఎంతో గ్లోబ‌ల్ సిటీ ప్లాన‌ర్ల భేటీ

Share it with your family & friends

సంప్ర‌దింపులు స‌త్ఫ‌లితం ఇచ్చాయి

దుబాయ్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని బృందం విదేశీ టూర్ విజ‌య‌వంతంగా ముగిసింది. హైద‌రాబాద్ కు చేరుకుంది ఈ టీం. అంత‌కు ముందు ఆదివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు దుబాయ్ లో చ‌ర్చ‌లు జ‌రిపారు రేవంత్ రెడ్డి.

అగ్ర‌శ్రేణి గ్లోబ‌ల్ సిటీ ప్లాన‌ర్స్ , డిజైన‌ర్లు , మెగా మాస్ట‌ర్ ప్లాన్ డెవ‌ల‌ప‌ర్లు , ఆర్కిటెక్ట్ ల‌తో వివ‌రాణ‌త్మ‌క చ‌ర్చ‌లు జ‌రిపారు సీఎం. ప్రధానంగా 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై చ‌ర్చించ‌డం జ‌రిగింది.

70కి పైగా విభిన్న ప్రధాన ప్రపంచ డిజైన్, ప్లానింగ్ , ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో గ్లోబల్ సంస్థలు యూరప్, మిడిల్ ఈస్ట్ , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో గతంలో చేప‌ట్టిన‌వి, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి వివ‌రించాయి. ఇందులో భాగంగా అన్ని సంస్థ‌లు తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టించాయ‌ని తెలిపింది రాష్ట్ర స‌ర్కార్.

అంతే కాకుండా తదుపరి సంప్రదింపుల కోసం వారు రాబోయే రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్ర‌పంచంలోనే మూసీని అద్భుత‌మైన న‌గ‌రంగా తీర్చి దిద్దాల‌న్న‌ది త‌మ సంక‌ల్ప‌మ‌ని పేర్కొన్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ముంద‌స్తు ప్లాన్స్ త‌యారు చేయాల‌ని ప్ర‌సిద్ద సంస్థ‌ల‌ను కోరారు.