పాలనా పరంగా చంద్రబాబు ఫెయిల్
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ రెడ్డి
కాకినాడ జిల్లా – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఏలూరు ను చూస్తే జాలి కలుగుతోందన్నారు. ఈ సందర్బంగా సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
భారీ వర్షాలు వస్తాయని ముందే వాతావరణ శాఖ హెచ్చరించిందని, అయినా సోయి లేని సీఎం పట్టించు కోలేదని ఆరోపించారు. స్వంత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద చంద్రబాబు నాయుడుకు, ఆయన పరివారానికి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి.
అన్నీ తానై చూసుకోవాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిద్ర పోయారని సంచలన కామెంట్స్ చేశారు. మొత్తంగా వరదల ప్రభావం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త టైం పడుతుందన్నారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వైసీపీ నేతలను టార్గెట్ చేయడం, వారిని ఇబ్బంది పెట్టాలని చూడటం తప్పితే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏపీకి ఏం చేశారంటూ నిలదీశారు జగన్ మోహన్ రెడ్డి.
అబద్దాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడు అవుతాడు. పచ్చి అబద్ధాలు చెబుతాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా దిట్ట అంటూ ఎద్దేవా చేశారు.