రాధికా శరత్ కుమార్ విరాట్ కోహ్లీ సెల్ఫీ వైరల్
లండన్ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో
తమిళనాడు – ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ అరుదైన ఫోటోను పంచుకున్నారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తను ప్రయాణం చేస్తున్న విమానంలో ఉన్న ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీతో ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించి షేర్ చేశారు నటి రాధికా శరత్ కుమార్.
కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న విరాట్ కోహ్లీని కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు. లండన్ నుండి చెన్నైకి తిరుగు ప్రయాణంలో లివింగ్ లెజెండ్ తో మాట్లాడటం చెప్పలేని సంతోషం కలిగించిందని తెలిపారు నటి రాధికా శరత్ కుమార్.
ఈ సందర్బంగా ఎన్నో విషయాలు పంచుకున్నామని స్పష్టం చేశారు. తాను నటిగా గుర్తింపు పొందినప్పటికీ తనకు క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టమని తెలిపింది . అంతే కాదు తమిళులు ఎక్కడున్నా ఒక్కసారి అభిమానించారంటే ఇక ఎవరినీ వదిలి పెట్టి ఉండరని పేర్కొంది నటి రాధికా శరత్ కుమార్.
ఇదిలా ఉండగా తమిళ నటి రాధికా శరత్ కుమార్ ను ఈ సందర్బంగా ఫ్లైట్ లో కలుసు కోవడం తనను విస్తు పోయేలా చేసిందని పేర్కొన్నారు ప్రముఖ లెజెండ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.