మెగా అదాలత్ లను వినియోగించు కోవాలి
పిలుపునిచ్చిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు
అమరావతి – ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా శనివారం జరగనున్న మెగా లోక్ అదాలత్ ను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు ఏపీ డీజీపీ.
ఇవాళ జరిగిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా ల SP, CP లతో మెగా లోక్ అదాలత్ పై సమీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రాజీ పడదగిన కేసుల గురించి ఈ సమీక్షలో ఆరా తీశారు.
రాష్ట్ర వ్యాప్తం గా జరగనున్న లోక్ అదాలత్ లో అన్ని పోలీస్ స్టేషన్ లలో పెండిగ్ లో వున్న రాజీ పడదగిన కేసులను త్వరిత గతిన పూర్తి చేసి, తగు ఫలితాలు రాబట్టాలని ఆదేశాలు జారి చేసారు.
ఈ సందర్బం గా ద్వారకా తీరుమల రావు మాట్లడుతూ దేశ వ్యాప్తం గా జరుగుతున్న మెగా లోక్ అదాలత్ కోసం ప్రజలలో అవగహన కల్పించాలి అని చెప్పారు.
అదేవిధం గా మెగా లోక్ అదాలత్ నందు ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనితో పాటు డిజిపి ఆధీనం లో ఉన్న APSRTC నందు కూడా ఈ మెగా లోక్ అదాలత్ ను వినియోగించుకొని కేసులను రాజీ చేయాలని సూచించారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల SP లతో పాటు రేంజ్ IG లు , IGP లీగల్ , ADD DGP CID పాల్గొన్నారు.