NEWSTELANGANA

ల‌క్ష‌లాది డ్రైవ‌ర్లు..కార్మికుల‌కు స‌లావుద్దీన్ స్పూర్తి

Share it with your family & friends

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అలుపెరుగ‌ని పోరాటం

హైద‌రాబాద్ – ఎవ‌రీ షేక్ స‌లావుద్దీన్ అనుకుంటున్నారా. భార‌త దేశంలో పేరు పొందిన యూనియ‌న్ నాయ‌కుడు. అంతే కాదు కోట్లాది మంది ప్ర‌యాణీకుల‌ను త‌మ గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ట్యాక్సీ డ్రైవ‌ర్లు, కార్మికుల‌కు షేక్ స‌లావుద్దీన్ స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఆ మ‌ధ్య‌న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో త‌ను కూడా పాలు పంచుకున్నాడు. యువ నాయ‌కుడితో క‌లిసి న‌డిచారు. ఆప్యాయంగా వెన్ను త‌ట్ట‌డ‌మే కాదు త‌న భుజం మీద చేయి వేసి ముందుకు న‌డిచాడు రాహుల్ గాంధీ.

షేక్ స‌లావుద్దీన్ స్వ‌స్థ‌లం తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్. ఎక్క‌డ ఏ చిన్న స‌మ‌స్య త‌లెత్తినా వెంట‌నే స్పందించ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. అందుకే త‌న‌ను లీడ‌ర్ గా త‌యారు చేసింది. డ్రైవ‌ర్లు, కార్మికుల ప‌క్షాన పోరాడుతున్నాడు. వారికి కూడా ఉద్యోగ భ‌ద్ర‌త అనేది ఉండాల‌ని కోరుకుంటున్నాడు. నిత్యం ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నాడు షేక్ స‌లావుద్దీన్.

త‌ను ఓ బాధ్య‌త క‌లిగిన భార‌తీయ పౌరుడిగా 12 రాష్ట్రాల‌లో పాద‌యాత్ర చేప‌ట్టాడు. పోనీ స‌లావుద్దీన్ ధ‌న‌వంతుడేమీ కాదు. వృత్తి రీత్యా ఉబెర్ డ్రైవ‌ర్. గ‌త 5 ఏళ్లుగా గిగ్ ఇండ‌స్ట్రీ ఆర్గ‌నైజ‌ర్ గా పేరు పొందారు. స‌మ్మెల‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌డం, విధాన నిర్ణేత‌ల‌తో నిమ‌గ్నం కావ‌డం చేస్తూ వ‌చ్చారు. ప్ర‌ధానంగా భార‌త దేశంలో పేరుకు పోయిన నిరుద్యోగ స‌మ‌స్య పోయేంత దాకా తాను నిద్ర పోయేది లేదంటున్నాడు షేక్ స‌లావుద్దీన్ .

ప్ర‌స్తుతం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. 2019లో, సలావుద్దీన్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT)ని స్థాపించారు. ఇది ఇప్పుడు 36,000 మందికి పైగా సభ్యులను కలిగి ఉన్న యూనియన్ల కూటమి.

ప్రస్తుతం ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు స‌లావుద్దీన్. 2020లో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU)ని కూడా ప్రారంభించాడు, ఇందులో ఇప్పుడు 10,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు, ఇందులో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ వర్కర్లు , దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఇ-కామర్స్ డెలివరీ వ్యక్తులు ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా హైదరాబాద్‌లో ఉబెర్ , ఓలా కోసం పని చేయడం ప్రారంభించిన మొదటి డ్రైవర్లలో సలావుద్దీన్ ఒకరు కావ‌డం విశేషం. ఆనాటి నుంచి నేటి దాకా స‌లావుద్దీన్ అలుపెరుగ‌ని రీతిలో పోరాడుతూనే ఉన్నారు. తోటి డ్రైవ‌ర్లు, కార్మికుల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు.