విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు.
గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ పనిగట్టుకుని విద్యా రంగాన్ని , వ్యవస్థను సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు నారా లోకేష్.
జగన్ రెడ్డి నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
కుప్పం ద్రవిడ యూనివర్శిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారని ఆరోపించారు నారా లోకేష్.
ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.