సిసోడియా..అరవింద్ కేజ్రీవాల్ వైరల్
మాజీ ఉప ముఖ్యమంత్రితో ఆలింగనం
న్యూఢిల్లీ – వాళ్లిద్దరూ ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు కళ్లు లాంటి వాళ్లు. వారు ఎవరో కాదు ఒకరు ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్. మరొకరు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. ఇద్దరూ పాలనా పరంగా తమదైన ముద్ర వేశారు.
గత కొంత కాలం నుంచీ ఈ ఇద్దరినీ రాజకీయంగా బద్నాం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇద్దరినీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించారు. ఆ తర్వాత జైలు పాలు చేశారు.
మనీష్ సిసోడియా 17 నెలల పాటు తీహార్ జైలులోనే ఉన్నారు. ఇక ఆరు నెలలకు పైగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే జైలు జీవితం గడిపారు. సార్వత్రిక ఎన్నికలకంటే ముందు వారం రోజుల పాటు బయటకు వచ్చారు అరవింద్ కేజ్రీవాల్. తిరిగి జైలుకు వెళ్లారు.
పలుమార్లు తనకు ఆరోగ్యం బాగో లేదని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఒప్పుకోక పోవడంతో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
చివరకు కోర్టు కీలక ప్రకటన చేసింది. అరెస్ట్ సబబే కానీ ఇంత కాలం జైలులో ఆధారాలు లేకుండా ఉంచలేమంటూ సంచలన తీర్పు వెలువరించింది. జైలు నుంచి వచ్చిన వెంటనే కృష్ణార్జునులుగా భావించే కేజ్రీవాల్, సిసోడియా ఆలింగనం చేసుకోవడం వైరల్ గా మారింది.