సింహాచలంలో పవిత్రోత్సవాలు
శ్రీశ్రీశ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి
విశాఖపట్నం జిల్లా – దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా మొదలయ్యాయి పవిత్రోత్సవాలు.
ఆలయ కార్య నిర్వహణాధికారి సింగాల శ్రీనివాసమూర్తి వారి ఆధ్వర్యంలో స్థానాచార్యులు డాక్టర్ టీపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు వైదిక సిబ్బంది వేద పండితులు నాదస్వర వేద మంత్రాలు నడుమ పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
రాత్రి 7 గంటలకు పాంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యా హవచనాలతో పవిత్రోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆలయంలో సెప్టెంబర్ 16 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 13 న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి సింగల శ్రీనివాసమూర్తి దంపతులు , సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.