అంబటి మురళిపై ఎమ్మెల్యే ధూళిపాళ ఫైర్
కడుతున్న నిర్మాణాలకు అనుమతి లేదు
గుంటూరు జిల్లా – పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సీరియస్ కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు శాసన సభ నియోజకవర్గం నుంచి ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయిన అంబటి మురళి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబటి మురళీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మాణం జరుగుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంతా అడ్డగోలుగా జరుగుతోందని ధూళిపాళ ఆరోపించారు.
2015లో రెండు సెల్లార్ లు, ఐదు ఫ్లోర్ లో కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. 2017లో 15 ఫ్లోర్ లకి అనుమతి అడగడం జరిగిందని చెప్పారు.
ఇప్పటి వరకూ వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని , ఈ వెంచర్ వెనుక పక్కన రెల్వే ట్రాక్ వెళుతుందన్నారు ధూళిపాళ.
రెవ్వే పట్టాల నుంచి 75 అడుగుల దూరం వదిలి పెట్టాలని రెల్వే శాఖ ఎన్వోసీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైల్వే ఎన్వోసీకి బిన్నంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వానికి , కార్పోరేషన్ అధికారులను మోసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర.
ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్ ట్రాఫిక్ ఎన్వోసీ, మైనింగ్ సెస్, ఇన్సురెన్సు పాలసీ ఉండాలని కానీ వీటికి సంబంధించి ఏ ఒక్కటి లేవన్నారు. అధికారులు వాళ్లతో కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపించారు.
సుమారు 5 వందల మందికి పైగా వినియోగ దారులను మోసం చేశారని మండిపడ్డారు నరేంద్ర .సామాన్యుడిపై ప్రతాపం చూపించే అధికారులు వీళ్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు.
వందల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వీళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు ఆపి వినియోగదారులకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు స్పందించక పోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ధూళిపాళ నరేంద్ర.