హనుమంతుడిని దర్శించుకున్న కేజ్రీవాల్
స్మరిస్తే అన్ని కష్టాలు..బాధలు మటుమాయం
ఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలులో 6 నెలలకు పైగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
శనివారం భారీ స్వాగతం మధ్యన బయటకు వచ్చారు కేజ్రీవాల్. ఆయన తన తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుకున్నారు. అక్కడి నుంచి తన భార్య తో కలిసి కన్నాట్ ప్లేస్ లో కొలువు తీరిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా ఆయనకు స్వాగతం పలికారు ఆలయ కమిటీ నిర్వాహకులు, పూజారులు. అనంతరం కేజ్రీవాల్ తో పాటు సతీమణి పూజలలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ వెంట మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా పూజల అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. పరాక్రమశాలి అయిన హనుమంతుడిని స్మరిస్తే అన్ని కష్టాలు, బాధలు తొలగిపోతాయని అన్నారు. ఆయన వెంట ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ కూడా ఉన్నారు.