NATIONALNEWS

రామాల‌యం దేశానికి గ‌ర్వ కార‌ణం

Share it with your family & friends

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

అయోధ్య – ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న యూపీలోని అయోధ్యలో ఉన్నారు. ఇవాళ ప్ర‌ధాన‌మంత్రి చేతుల మీదుగా శ్రీ‌రాముడి పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా దేశంలోని 7,000 మంది ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అందాయి. వీటిని శ్రీ‌రామ జ‌న్మ భూమి ట్ర‌స్టు అంద‌జేసింది. యూపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టారు.

ఇందులో భాగంగా సినీ రంగానికి చెందిన నటీ న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు, క్రీడా రంగానికి చెందిన వారు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట‌ర్ దిగ్గ‌జాల‌కు ఇన్విటేష‌న్లు వెళ్లాయి. ఇక తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న , ప్ర‌భాస్ కూడా ఆహ్వానాలు అందుకున్నారు.

అంద‌రి కంటే ముందే వెళ్లారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న ముందు నుంచీ భార‌తీయ జ‌న‌తా పార్టీతో, మోదీతో స‌త్ సంబంధాలు నెరుపుతూ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి ఒక్క భార‌తీయుడి క‌ల ఏదైనా ఉందంటే అది అయోధ్య లోని రామాల‌యం మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇవాళ ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు.