SPORTS

రియ‌ల్ ఛాంపియ‌న్ నీర‌జ్ చోప్రా

Share it with your family & friends

మ‌రోసారి సత్తా చాటిన క్రీడాకారుడు

ఢిల్లీ – భార‌త దేశానికి చెందిన జావెలిన్ త్రోయ‌ర్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఈ ఏడాది ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ లో జ‌రిగిన పోటీల్లో పాకిస్తాన్ ఆట‌గాడి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. త‌ను బంగారు ప‌త‌కాన్ని సాధిస్తే నీర‌జ్ చోప్రా ర‌జ‌తంతో స‌రిపెట్టుకున్నాడు.

తాజాగా జ‌రిగిన డైమండ్ లీగ్ పోటీల్లో దుమ్ము రేపాడు. చాంపియ‌న్ గా అవ‌త‌రించాడు నీర‌జ్ చోప్రా. అంత‌కు ముందు ప‌లు పత‌కాల‌ను సాధించాడు. 2016లో జ‌రిగిన ద‌క్షిణాసియా పోటీల్లో బంగారు ప‌త‌కంతో రికార్డ్ సృష్టించాడు. 2017లో ఆసియా ఛాంపియ‌న్ గా అవ‌త‌రించారు నీర‌జ్ చోప్రా.

2018లో జ‌రిగిన సీడ‌బ్ల్యూజీలో దుమ్ము రేపాడు. ప‌త‌కంతో విస్తు పోయేలా చేశాడు . 2020లో జ‌రిగిన ఒలింపిక్స్ పోటీల్లో జావెలిన్ త్రోలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు ప‌త‌కం సాధించాడు.

ఇదే స‌మ‌యంలో 2022లో జ‌రిగిన 1వ డైమండ్ లీగ్ పోటీల్లో నీరజ్ చోప్రా బంగారు ప‌త‌కాన్ని సాధించాడు.
అంతే కాకుండా 2022, 2023 సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన పోటీల్లో ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిలిచాడు నీర‌జ్ చోప్రా. తాజాగా జ‌రిగిన 2వ డై మండ్ లీగ్ పోటీల్లో దుమ్ము లేపాడు. గోల్డెన్ బాయ్ గా నిలిచాడు.