శ్రీధర్ బాబు కామెంట్స్ కేటీఆర్ సీరియస్
ఇంత నీతి మాలిన రాజకీయం ఎందుకు
హైదరాబాద్ – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలివి లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
సోయి తప్పి మాట్లాడటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీ లోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అని ప్రశ్నించారు.
సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం అని పేర్కొన్నారు కేటీఆర్. మరి మా BRS ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు అని ప్రశ్నించారు కేటీఆర్.
సిగ్గు లేకుండా ఇంత నీతి మాలిన రాజకీయం ఎందుకు అని నిలదీశారు. అసలు చేర్చు కోవడం ఎందుకు అని ప్రశ్నించారు. ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు ? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోందని పేర్కొన్నారు.
మీరు మీ అతి తెలివితో హైకోర్టు ను మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.