21న పబ్లిక్ పాలసీపై కీలక సదస్సు
హాజరు కానున్న జయేశ్ రంజన్
హైదరాబాద్ – ప్రభుత్వ సేవలను పెంపొందించడానికి , సమ్మిళితతను ప్రోత్సహించడానికి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకునే వ్యూహాలపై కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ ఆధ్వర్యంలో కీలక సదస్సు జరగనుంది. ఈ ముఖ్యమైన సమావేశం సెప్టెంబర్ 21న హైదరాబాద్ లో జరగనుందని సంస్థ పేర్కొంది.
ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం టెక్నాలజీ విస్తరిస్తోందని, ఈ తరుణంలో డిజిటల్ గవర్నెన్స్ ఎలా దృష్టి సారిస్తుందనే దానిపై చర్చ లు జరుగుతాయని తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ కీలక సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
ఈ సదస్సులో రేజర్ పే ఇండియా లో ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా ఉన్న శరణ్య గోపినాథ్, డెలాయిట్ సౌత్ ఆసియా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ , పార్ట్ నర్ సుదీప్త వీరపనేని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ పరిశ్రమల శాఖ జయేష్ రంజన్ , నాస్కామ్ ఫౌండేషన్ డిజిటల్ లిటరసీ, లైవ్లీ హుడ్ ఇనిషియేట్స్ డైరెక్టర్ విక్రమ్ పాటిల్ హాజరు కానున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా కీలక సదస్సు సెప్టెంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పాల్గొనాలని అనుకునే వారు ఈ కింది లింకు ద్వారా https://kspp.edu.in/kautilya-colloquy-2024లో నమోదు చేసుకోవాలని, చర్చల్లో పాల్గొనాలని కోరింది కౌటిల్య పబ్లిక్ పాలసీ.