సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా – కేజ్రీవాల్
ఆప్ బాస్ సంచలన ప్రకటన
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి తాను రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ కీలక ప్రకటనతో ఒక్కసారిగా ఆప్ లో కలకలం రేపింది. నాయకులు, మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు విస్మయానికి లోనయ్యారు. రెండు రోజుల్లోనే తాను రాజీనామా చేస్తానని ప్రకటించడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు.
పార్టీ ప్రయోజనాల రీత్యా తాను సీఎం పదవి నుంచి తప్పు కోవాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఆరు నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రెండు సార్లు బయటకు వచ్చారు. చివరకు మధ్యంతర బెయిల్ మీద నిన్న విడుదలయ్యారు. ఆ వెంటనే హనుమాన్ టెంపు ల్ ను దర్శించుకుని పూజలు చేశారు. త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చర్చనీయాంశంగా మారింది.