NEWSANDHRA PRADESH

16న సీతారాం ఏచూరి సంస్మరణ సభ

Share it with your family & friends

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు

గుంటూరు జిల్లా – జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు గుంటూరులోని రామన్నపేటలో గల జన చైతన్య వేదిక హాలులో ప్రజా పోరాట యోధులు, వామపక్ష ఉద్యమాల నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభను అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలతో నిర్వహిస్తున్నామని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.

ప్రధాన వక్తగా తెలుగుదేశం పార్టీ లోక్ సభ పక్ష నేత నరసరావుపేట లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు వక్తలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, మాజీ కేంద్ర మంత్రివర్యులు జె.డి. శీలం, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, శాసన మండలి సభ్యులు కె. యస్. లక్ష్మణరావు, చంద్రగిరి ఏసు రత్నం, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షులు వై. వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ శాసన సభ్యులు లింగం శెట్టి ఈశ్వరరావు, వివిధ ప్రజాసంఘాల స్వచ్ఛంద సంస్థల నేతలు పాల్గొంటార‌ని తెలిపారు.

సీతారాం ఏచూరి సంస్మరణ సభ లో పాల్గొని ప్రసంగిస్తారని వామపక్షవాదులు, ప్రజాస్వామ్యవాదులు హాజరై నివాళులు అర్పించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు.