దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ
ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ ఫైర్
ఢిల్లీ – భారత దేశంలో అత్యంత అవినీతి కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. ఆదివారం ఆప్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు.
బిజెపి అంటే బేషరమ్ ఝూతా పార్టీ . ఆ పార్టీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆప్ ను లేకుండ చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చిందని ఆరోపించారు. కానీ ఎక్కడా ఆప్ ను ఢీకొనే సాహసం చేయలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తమకు నిరంతరం సేవలు అందిస్తున్న ఆప్ ను ఆదరిస్తూ వచ్చారని చెప్పారు.
త్వరలో ఢిల్లీలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. అత్యంత అవినీతితో కూరుకు పోయిన కాషాయ పార్టీకి నియంతలుగా పీఎం మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారని మండిపడ్డారు.
రాజకీయ విలువలకు కట్టుబడి నిజాయితీతో ఢిల్లీ ప్రజలకు సేవలందిస్తూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ పై తప్పుడు ఆరోపణలు చేశారని వాపోయారు. రెండు రోజుల తర్వాత తమ నాయకుడు సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రజలు నిస్వార్థంగా సేవలు అందించే వారికి పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు ఆప్ ఎంపీ.