ENTERTAINMENT

దేవ‌ర అంద‌రినీ అల‌రిస్తుంది – కొర‌టాల

Share it with your family & friends

జాన్వీ క్యారెక్ట‌ర్ రాసేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డా

హైద‌రాబాద్ – అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ జూనియ‌ర్ ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ క‌లిసి న‌టించిన దేవ‌ర చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఈ సంద‌ర్బంగా సినిమా టీమ్ ముచ్చ‌టించారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు ద‌ర్శ‌కులు వంగా సందీప్ రెడ్డి, కొర‌టాల శివ ఇందులో పాల్గొన్నారు. త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్బంగా వంగా సందీప్ రెడ్డి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ.

అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకునేలా తాను దేవ‌ర చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాన‌ని అన్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు న‌టి జాన్వీ క‌పూర్. సినిమా క‌థ రాసుకున‌నే స‌మ‌యంలో ఎన్టీఆర్, సైఫ్ , ఇత‌ర పాత్ర‌ల‌కు రాయ‌డం సుల‌భంగా అనిపించిన‌ప్ప‌టికీ జాన్వీ క్యారెక్ట‌ర్ రాసే విష‌యంలో తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పారు.

మొత్తంగా ఈ దేవ‌ర సినిమా స‌క్సెస్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. అన్ని వ‌ర్గాల వారు దేవ‌ర‌ను ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు ద‌ర్శ‌కుడు.