ENTERTAINMENT

మంజు వారియ‌ర్ స్టెప్పులు అదుర్స్

Share it with your family & friends

వెట్ట‌యాన్ చిత్రంలో సూప‌ర్ షో

హైద‌రాబాద్ – త‌మిళ సినీ రంగానికి చెందిన సూప‌ర్ స్టార్, త‌లైవా ర‌జ‌నీకాంత్ , మంజు వారియ‌ర్ తో క‌లిసి న‌టించిన వెట్ట‌యాన్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ముఖ‌ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ మూవీకి చెందిన సాంగ్ మ‌న‌సిలాయో దుమ్ము రేపుతోంది. ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. కోట్లాది మంది ఈ పాట‌కు హ‌మ్ చేస్తున్నారు. దానిలో లీన‌మ‌వుతున్నారు.

ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టి లాగే న‌వ యువ‌కుడిగా మెస్మ‌రైజ్ చ‌స్తే అందాల ముద్దుగుమ్మ మంజు వారియ‌ర్ పోటీ ప‌డి న‌టించింది. స్లో మూవ్ మెంట్స్ తో అద‌ర‌గొట్టేలా స్టెప్పుల‌తో అల‌రించారు ఈ ఇద్ద‌రు. ప్ర‌ధానంగా మంజు వేసిన స్టెప్పుల‌కు యూత్ ఫిదా అవుతోంది.

వెట్ట‌యాన్ సినిమాకు టిజె జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మ‌న‌సిలాయో సాంగ్ ను సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేశారు. ఇప్ప‌టి దాకా టాప్ లో కొన‌సాగుతోంది. 17 కోట్ల మందికి పైగా దీనిని వీక్షించారు. ఈ పాట‌ను సూప‌ర్ సుబు, విష్ణు ఎద‌వ‌న్ రాశారు. మ‌లేషియా వాసుదేవ‌న్, యుగేంద్ర‌న్ వాసుదేవ‌న్ , అనిరుధ్ ర‌విచంద‌ర్ , దీప్తి సురేష్ పాడారు.

ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్, అమితాబ్ బ‌చ్చ‌న్, ఫ‌హ‌ద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియ‌ర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజ‌య‌న్, జీఎం సుంద‌ర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, ర‌మేష్ తిల‌క్, రక్ష‌ణ న‌టించారు.