NEWSNATIONAL

సీఎం కేజ్రీవాల్ నిర్ణ‌యం సంచ‌ల‌నం

Share it with your family & friends

చ‌ర్చ నీయాంశంగా మారిన వైనం

ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన తాజా ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌ధానంగా రాజ‌కీయ పార్టీల‌లో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఢిల్లీలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ ఆప్ స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఆప్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం, ఆప్ బాస్. తాను రెండు రోజుల‌లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుండి త‌ప్పుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ముంద‌స్తుగా ఎన్నిక‌ల్లోకి వెళ్లాల‌ని తాను డిసైడ్ అయ్యాన‌ని, తాను అవినీతి ప‌రుడినో కాదో అనే విష‌యం తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా, దేశంతో పాటు ఢిల్లీలోని ప్రతి వీధి ప్రజలు బెయిల్ తెచ్చుకుని రాజీనామా చేస్తున్న ముఖ్యమంత్రిని మొదటిసారి చూశామని చర్చించు కుంటున్నార‌ని తెలిపారు ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు.

ఈ దేశంలో చాలా మంది నాయ‌కులు, సీఎంలు కులం పేరుతో, మ‌తం పేరుతో ఓట్లు అడిగారని, కానీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మాత్రం తాను చేసిన ప‌ని ఆధారంగా త‌న‌కు ఓటు వేయాల‌ని కోర‌డం విస్తు పోయేలా చేసింద‌న్నారు.