ENTERTAINMENT

సీఎం స‌హాయ నిధికి ప్ర‌ముఖుల‌ విరాళం

Share it with your family & friends

రూ. 50 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేసిన రామ్ చ‌ర‌ణ్

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో చోటు చేసుకున్న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో బాధితుల కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ప్ర‌ముఖులు విరాళాలు అంద‌జేశారు. సోమ‌వారం సీఎం స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లు విరాళం అంద‌జేశారు మెగాస్టార్ చిరంజీవి.

త‌న‌తో పాటు త‌న త‌న‌యుడు, ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ త‌ర‌పున కూడా మ‌రో రూ. 50 ల‌క్ష‌లు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అంద‌జేశారు . రెండు చెక్కుల‌ను సీఎం రేవంత్ రెడ్డికి అంద‌జేశారు.

మ‌రో వైపు అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేసిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3 లక్షలు విరాళంగా అంద జేశారు సినీ నటుడు అలీ.

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు విశ్వక్ సేన. ఆయ‌న‌తో పాటు జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు సినీ రంగానికి చెందిన‌ ప్రముఖులు.