20న బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు రాజీనామా స‌మ‌ర్పించిన సుశాన్ బాబు

బీహార్ : అంద‌రి అంచ‌న‌లు త‌ల‌కిందులు చేస్తూ బీహార్ లో మ‌రోసారి ముఖ్యమంత్రిగా కొలువు తీర‌నున్నారు నితీశ్ కుమార్. ఆయ‌న‌ను అంద‌రూ రాష్ట్ర ప్ర‌జ‌లు సుశేన్ బాబు అని పిలుచుకుంటారు. లోక్ నాయ‌క్ జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ప్ర‌భావం త‌న‌పై ఉంది. సోష‌లిస్టు నుంచి పొలిటిక‌ల్ టార్చ్ బేర‌ర్ గా గుర్తింపు పొందాడు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా స‌రే త‌నే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌డం. ఇది ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త‌కు నిదర్శ‌నం. తాజాగా త‌న సార‌థ్యంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ మెజారిటీని సాధించింది. 203 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో బీజేపీ నుంచి ఒక‌రు సీఎం గా ఉంటార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ దానికి చెక్ పెడుతూ త‌నే సీఎం సుప్రీం అంటూ ప్ర‌క‌టించాడు నితీశ్ కుమార్.

ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది ఈ మేర‌కు 20 తేదీన తాను మ‌రోసారి బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు స్వ‌యంగా నితీశ్ కుమార్. ప్ర‌మాణ స్వీకారం చేసే కంటే ముందు ప్ర‌భుత్వంలో కొలువు తీరిన సీఎంతో పాటు మంత్రులంతా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు త‌న రాజీనామాను సమ‌ర్పించారు. అప్ప‌టి వ‌ర‌కు మీరు ఆప‌ద్ద‌ర్మ సీఎంగా ఉండాల‌ని సూచించారు . దీనికి ఓకే చెప్పారు. విచిత్రం ఏమిటంటే మ‌హాఘ‌ట్ బంధ‌న్ కు భారీగా సీట్లు వ‌స్తాయ‌ని చెప్పినా చివ‌ర‌కు ఉన్న సీట్ల‌ను కూడా తెచ్చుకోలేక పోయాయి. ఈ త‌రుణంలో కూట‌మి లో లుకలుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *