NEWSANDHRA PRADESH

కోడెల ప్ర‌జ‌ల ఆత్మ బంధువు – టీడీపీ

Share it with your family & friends

కేంద్ర కార్యాల‌యంలో నివాళులు

అమరావ‌తి – పల్నాడు ప్రజల ఆత్మ బంధువు, ఆత్మీయ బంధువైన ప్రజా నాయకుడు కోడెల శివప్రసాదరావు వర్థంతి సెప్టెంబ‌ర్ 16 సోమ‌వారం.

ఈ సందర్భంగా టీడీపీ (తెలుగుదేశం) కేంద్ర కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నేతలు ఆయన సేవలను కొనియాడారు.. మూడున్నర దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో పల్నాడు అభివృద్ధి కోసమే ఆయన ప్రతి నిమిషం పనిచేశారని గుర్తు చేసుకున్నారు.

ప్రజల సంక్షేమానికి పాటు ప‌డ‌డంతో పాటు .. పార్టీకోసం, కార్యకర్తల కోసం అన్ని సందర్భాల్లో అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని మెచ్చుకున్నారు.

ఆయన సేవలను పల్నాడు నేతలు ఆదర్శంగా తీసుకుని పల్నాడు అభివృద్ధికోసం, పల్నాడు ప్రజల క్షేమం కోసం పనిచేయాలని ఆకాక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ మరియు పార్టీ నేతలు ఏవి రమణ, ధారపనేని నరేంద్ర బాబు, చప్పిడి రాజశేఖర్, దేవినేని శంకర్ నాయుడు తదితర నేతలు పాల్గొన్నారు.