NEWSNATIONAL

వందే మెట్రో రైల్ పేరు మార్పు – కేంద్రం

Share it with your family & friends

నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా నామకరణం

ఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వందే మెట్రో రైలు పేరును మారుస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దాని పేరును న‌మో భార‌త్ ర్యాపిడ్ రైల్ గా మార్చిన‌ట్లు తెలిపింది.

వందే మెట్రో అత్యాధునిక సాంకేతికత, అధునాతన ఫీచర్లతో విస్తృత ప్రయాణ అవసరాలను తీర్చడానికి రూపొందించిన‌ట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. వివిధ న‌గ‌రాల మ‌ధ్య విస్తృత‌మైన నెట్ వ‌ర్క్, వేగంంతో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపింది.

ఇదిలా ఉండ‌గా భారతీయ రైల్వే అధికారికంగా వందే మెట్రో సర్వీస్ పేరును “నమో భారత్ ర్యాపిడ్ రైల్”గా మార్చిన‌ట్లు ఇది ఇవాల్టి నుంచి అమలులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది.

ఇది దేశంలోని కీలకమైన రాబోయే రైలు ప్రాజెక్టులలో ఒక దానికి బ్రాండింగ్‌లో మార్పును సూచిస్తుందని తెలిపింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్చడం జరిగింది.

నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని, సాంప్రదాయ రైళ్లకు వేగవంతమైన ప్రత్యామ్నాయాన్ని అంద జేస్తుందని పేర్కొంది రైల్వే శాఖ‌.

నమో భారత్ ర్యాపిడ్ రైల్‌లో 1,150 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా 12 కోచ్‌లు ఉంటాయి. ఇది భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు 359 కి.మీ దూరాన్ని 5:45 గంటల్లో కవర్ చేస్తుందని తెలిపింది.