వరద బాధితుల కోసం ఆలీ సాయం
అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – వరద బాధితుల సహాయం కోసం పలువురు నటులు స్పందించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇవాళ కొందరు నటులు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలుసుకుని చెక్కులను అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా రూ. 50 లక్షలు మరో రూ. 50 లక్షలను తన తనయుడు రామ్ చరణ్ తరపున రెండు చెక్కులు రూ. కోటిని సీఎం ఎ. రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్బంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
అనంతరం ప్రముఖ హాస్య నటుడు ఆలీ తన భార్యతో కలిసి సీఎం ను తన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి. క్షేమ సమాచారాన్ని కనుక్కున్నారు. వరద బాధితుల కోసం రూ. 3 లక్షల చెక్కును సీఎం సహాయ నిధికి అందజేశారు.
చిరంజీవి, ఆలీతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 25 లక్షలు , మహేష్ బాబు రూ. 50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, నందమూరి బాలకృష్ణ రూ. 50 లక్షలు , ప్రభాస్ , విశ్వక్ సేన్ , అనన్య నాగళ్ల, జొన్నలగడ్డ సిద్దూ తమ వంతు సాయం ప్రకటించారు . ఇరు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం విరాళాలు అందజేశారు.