ENTERTAINMENT

ఒక్క‌టైన అదితి రావు సిద్దార్థ్

Share it with your family & friends

400 ఏళ్ల పురాత‌న ఆల‌యంలో

వ‌న‌ప‌ర్తి జిల్లా – ప్ర‌ముఖ న‌టీ న‌టులు ఆదితి రావు సిద్దార్థ్ ఒక్క‌ట‌య్యారు. వారిద్ద‌రూ గ‌త కొంత కాలం నుంచీ డేటింగ్ లో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే 400 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన పురాత‌న ఆల‌యంలో పెళ్లి చేసుకోవ‌డం విస్మ‌యానికి గురి చేసింది. ఇది ఎక్క‌డో కాదు తెలంగాణ రాష్ట్రంలోని వ‌న‌ప‌ర్తి జిల్లా పెబ్బేరు మండ‌ల ప‌రిధిలో పేరు పొందిన శ్రీ‌రంగాపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగ‌నాయ‌క స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు.

ఈ ఆల‌యానికి విశిష్ట‌మైన చ‌రిత్ర ఉంది. త‌మ పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను న‌టి ఆదితి రావు షేర్ చేశారు ఇన్ స్టా గ్రామ్ లో. ఈ ఇద్ద‌రు ఎవ‌రికీ తెలియ‌కుండా ప్రైవేట్ గా వివాహం చేసుకున్నారు. అదితి కుటుంబానికి ఈ స్థ‌లం అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన‌ది కావ‌డం విశేషం.

ఇక ఆల‌యానికి వ‌స్తే శ్రీ రంగనాయక స్వామి ఆలయం అత్యంత ప్ర‌సిద్ది చెందింది. ఇది క్రీస్తుశకం 18వ శతాబ్దంలో నిర్మించ బడింది. తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి దేవాలయం నుండి ప్రేరణ పొందిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయలు తన రాజ్యంలో ఇదే విధమైన మందిరాన్ని నిర్మించడానికి ప్రేరేపించబడ్డాడు.

పురాణాల ప్రకారం, అతను కొత్తకోట , కానాయ‌ప‌ల్లి దేవాల‌యాల మ‌ధ్య స్థాపించిన రంగ‌నాథుని విగ్ర‌హానికి క‌ల ద్వారా మార్గనిర్దేశం చేసిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది.

ఈ ఆలయం రత్న పుష్కరిణి సరస్సు సమీపంలో నిర్మించ బడిన విజయనగర వాస్తు శిల్పానికి అద్భుతమైన ప్రతిబింబంగా నిలుస్తోంది.