ENTERTAINMENT

వెట్టైయాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Share it with your family & friends

ర‌జ‌నీ కాంత్ ..మంజూ వారియ‌ర్

హైద‌రాబాద్ – సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మేన‌రిజానికి తోడు 40 ఏళ్ల మంజూ వారియ‌ర్ చేసిన డ్యాన్సు, న‌ట‌న వెట్టైయాన్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచేలా చేశాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో, పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రోసారి రికార్డుల మోత మోగించేందుకు రెడీ అవుతోంది వెట్టైయాన్.

త‌లైవర్ ర‌జ‌నీకాంత్ కు త‌న సినీ కెరీర్ లో ఇది 170వ సినిమా కావ‌డం విశేషం. టీజీ జ్ఞాన‌వేల్ ఈ చిత్రానికి క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎప్ప‌టి లాగే మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ‌రోసారి దుమ్ము రేపాడు. కిక్ తో పాటు హుషారు ఎక్కించేలా పాట‌ల‌ను రూపొందించాడు.

ప్ర‌ధానంగా మ‌న‌సాలియో సాంగ్ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. కోట్ల‌ల్లో ఈ సాంగ్ ను చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండ‌గా రూ. 160 కోట్లకు పైగా బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు టీజీ జ్ఞాన‌వేల్.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ వెట్టైయాన్ ను నిర్మించింది. వ‌చ్చే అక్టోబ‌ర్ 10వ తేదీన వ‌ర‌ల్డ్ వైడ్ గా మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా త‌లైవా మ‌రోసారి రికార్డుల మోత మోగించేందుకు రెడీ అయ్యాడ‌న్న‌మాట‌.