20న వెట్టైయాన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్
ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా
హైదరాబాద్ – తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ , మంజూ వారియర్ కలిసి నటించిన వెట్టైయాన్ చిత్రం వచ్చే అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించ బోతోంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు టీజీ జ్ఞానవేల్ , నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
సినిమాకు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. సెప్టెంబర్ 20న చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో వెట్టైయాన్ మూవీకి సంబంధించి ఆడియో రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపింది లైకా ప్రొడక్షన్స్.
ఇప్పటికే విడుదలైన ప్రోమో, మనసాలియో సాంగ్ సాంగ్స్ చార్ట్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కోట్లాది మంది ఈ పాటకు హమ్ చేస్తున్నారు. స్లో మోషన్ లో రజనీకాంత్, మంజూ వారియర్ చేసిన డ్యాన్స్ , వేసిన స్టెప్టులు మరింత క్యూరియాసిటీని పెంచేలా చేసింది వెట్టైయాన్. ఎప్పటి లాగే తన మేనరిజంతో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్.
ఈ సినిమాలో రజనీ, మంజూతో పాటు అమితాబ్ బచ్చన్ , ఫాసిల్, దగ్గుబాటి రానా కూడా నటిస్తుండడం విశేషం.