జానీ మాస్టర్ లీలలు ఎన్నెన్నో
వేధింపుల పర్వానాకి పరాకాష్ట
హైదరాబాద్ – తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లీలలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మనోడు జనసేన పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచాడు. అంతే కాదు ఆ మధ్యన ఆ పార్టీ కోసం ఓ పాట కూడా చేసి పెట్టాడు. అందులో నటించాడు కూడా.
తాజాగా 21 ఏళ్ల కొరియో గ్రాఫర్ తనను గత కొంత కాలం నుంచీ జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడని వాపోయింది. గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జానీ మాస్టర్ పూర్తి పేరు షేక్ జానీ భాషా . తను ముస్లిం. బాధితురాలు హిందువు. దీంతో పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. తనను మతం మార్చు కోవాలంటూ బలవంతం చేశాడని వాపోయింది.
చివరికి బాధితురాలు వినిపించుకోక పోవడంతో జానీ మాస్టర్ భార్య బాధితురాలి ఇంటికెళ్లి తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ భౌతికదాడికి పాల్పడిందని ఆరోపించింది. అయినా అంగీకరించక పోవడంతో తనపై కక్ష కట్టాడని, ఎలాగైనా తనకు లొంగి పోవాలంటూ వేధింపులకు గురి చేశాడంటూ వాపోయింది.
ఎవరికైనా చెబితే నీ సినీ కెరీర్ నాశనం చేస్తానంటూ బెదిరించాడని తెలిపింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని సమాచారం.