నేను ఫాం హౌస్ సీఎంను కాను – రేవంత్ రెడ్డి
ఢిల్లీ పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ లో లేదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో జరగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగుర వేసి ప్రసంగించారు.
తాను బయటకు కదలకుండా ఇంట్లో ఉండేందుకు ఫాంహౌస్ ముఖ్యమంత్రిని కాను అని చెప్పారు. తాను కష్టపడి పనిచేసే సీఎంనని అన్నారు.
తన స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో ఢిల్లీకి పదే పదే వెళ్లడం లేదని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం , రాష్ట్ర అభివృద్ది కోసం మాత్రమే వెళుతున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. తనను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై స్పందించారు . తాను ఇప్పటి వరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఢిల్లీ అనేది భారత దేశానికి రాజధాని. ఆయా రాష్ట్రాలకు పనులు తప్పకుండా ఉంటాయని, ఆ విషయం మంత్రిగా పని చేసిన కేటీఆర్ కు తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అయితే ఢిల్లీ అనేది పాకిస్తాన్ లో లేదా బంగ్లాదేశ్ లో లేదు కదా అని ప్రశ్నించారు .