ముమ్మరంగా బోట్ల తొలగింపు ప్రక్రియ
కొనసాగుతోందన్న మంత్రి నిమ్మల
విజయవాడ – వరద ప్రభావిత ప్రాంతాలలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు తమ తమ నియోజకవర్గాలలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఏపీ మంత్రులు నిమ్మల రామా నాయుడు, హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి దగ్గరుండి చూస్తున్నారు.
మంగళవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ లో బోట్ల తొలగింపు పనులు పరిశీలించారు. కృష్ణ నదిలో బోటులో పర్యటించి బోట్ల తొలగింపు పనులు చూశారు. ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు పలు సూచనలు చేశారు. ఆయన రేయింబవళ్లు ఇక్కడే ఉన్నారు. పనులు పర్యవేక్షిస్తుండడం విశేషం. ఈ సందర్బంగా నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా అభినందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు.
ఇదిలా ఉండగా ఇప్పటికే వాటర్ పూలింగ్ ద్వారా రెండు అడుగులు పైకి వచ్చింది బోటు. మంగళవారం కూడా మరో అడుగు పైకి లేపితే బోటు కదిలే అవకాశం ఉందని అనుకుంటున్నారు అధికారులు. అయితే బోట్ల తొలగించే పనులు ఒకకొలిక్కి రానుందని అంచనా వేస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ప్రధానంగా బ్యారేజ్ భద్రత కు , ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్బంగా చెప్పారు మంత్రి.