గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే
వైసీపీ విజయవాడ ఇంఛార్జ్ అవినాష్
విజయవాడ – తాము గెలిచినా ఓడి పోయినా ప్రజల మధ్యనే ఉంటామని స్పష్టం చేశారు విజయవాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల కోసం తమ వంతుగా సాయం చేస్తున్నామని చెప్పారు.
ఏపీలో కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం మాత్రమే పని చేస్తోందని ఆరోపించారు. నిజమైన పేదలు, సామాన్యులు, వరద బాధితుల కోసం పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దేవినేని అవినాష్.
తమ నాయకుడు పలుమార్లు బాధితులను పరామర్శించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పటికే వరద బాధితులకు అండగా రూ. ఒక కోటి ప్రకటించారని చెప్పారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సారథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు దేవినేని అవినాష్.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీకి నాయకులు, కార్యకర్తల బలగం ఉందని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాము గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు దేవేనిని అవినాష్.