NEWSANDHRA PRADESH

రాహుల్ పై కామెంట్స్ ష‌ర్మిల సీరియ‌స్

Share it with your family & friends

బ‌లిదానాలు చేసిన చరిత్ర మ‌రిచి పోతే ఎలా

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు. ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీ అటు కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు, 140 కోట్ల మంది గుండెల్లో ప్రేమ, స్నేహ భావం, ఐకమత్య రాగం నింపుతుంటే ఆ తుఫాను తట్టుకోలేక, పిరికిపందల్లా, ఇలాంటి దివాలాకోరు మాటలు మాట్లాడటానికి బీజేపీ వాళ్ళు సిగ్గు ప‌డాలని అన్నారు.

నాటి ఇందిరమ్మ నుండి, రాజీవ్ గాంధీ వరకు, ఆ కుటుంబం మొత్తం దేశం కోసం ఆత్మ త్యాగాలు చేసినవారేన‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

ఆనాడు బ్రిటిష్ వారి నుండి నేటి మీ ఫాసిస్టు శక్తుల మీద పోరాడుతున్నది అయన నేతృత్వంలోని కాంగ్రెస్సే న‌ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. అలాంటి వారికా బీజేపీ వాళ్ళు పేర్లు పెడుతున్నదని మండిప‌డ్డారు ఏపీపీసీసీ చీఫ్‌.

అసలు తీవ్రవాదుల లక్షణాలను అణువణువునా నింపుకుని, మనుషుల మధ్య చిచ్చు పెట్టి, చలిగాచుకునే నీచ సంస్కృతి మీ బీజేపీది కదా? మీలాంటి విచ్చిన్నకర శక్తుల మీద పోరాడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద కత్తికట్టే విఫల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇకపై మీ పాచికలు పారవు, ప్రజలు మీ అసలు స్వ‌రూపం ఏమిటో తెలుసుకున్నార‌ని అన్నారు. మీ అసహనం చెప్తున్నది, దేశం మొత్తం రాహుల్ గాంధీని ప్రేమిస్తోందని, అయన నుండి స్ఫూర్తి తీసుకుంటున్నదని. ఇక ఇప్పుడు ఒకటే పోరాటం, దేశాన్ని విచ్చిన్నం చేసే వారికి, దేశాన్ని ప్రేమ, సోదర భావంతో ఏకం చేసే వారికి మ‌ధ్య యుద్దం త‌ప్ప‌ద‌న్నారు.

రాహుల్ గాంధీ పైన మీరు చేసిన అతి దారుణమైన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.