NEWSANDHRA PRADESH

ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు పూర్వ వైభ‌వం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన మంత్రి కందుల దుర్గేష్

విజ‌య‌వాడ – భారీ వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో పునరుద్దరణ చర్యలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ . వ‌ర‌ద‌ల కార‌ణంగా చోటు చేసుకున్న న‌ష్టాన్ని అధికారులు అంచ‌నా వేసే ప‌నిలో ఉన్నార‌ని, పూర్తి స్థాయిలో నివేదిక అందిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.

విజయవాడలో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు కందుల దుర్గేష్. వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ తదితర పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు మంత్రి. అధికారులను అడిగి వరద నష్టంపై ఆరా తీశారు.

దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ వరదల తాకిడికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో పునరుద్దరణ చర్యలు చేపడ‌తామ‌న్నారు.

వీలైనంత త్వరగా పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నష్టంపై అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకొని చర్యలు చేపడుతామన్నారు..మళ్ళీ విజయవాడ లో పర్యాటకం పుంజుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ ఈడీ పద్మావతి, ఓఎస్డి చైత్ర వర్షిణి, డివిఎం చైతన్య, ఏపీటీడీసీ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.