ENTERTAINMENT

దేవ‌ర మూవీపై తార‌క్ కామెంట్స్

Share it with your family & friends

అంచ‌నాల‌కు మించి స‌క్సెస్ ఖాయం

హైద‌రాబాద్ – డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, జాహ్న‌వి క‌పూర్ జంట‌గా నటించిన దేవ‌ర ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది త్వ‌ర‌లో. ఈ సంద‌ర్బంగా సినిమా ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున చేస్తోంది మూవీ టీం.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివతో పాటు సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ సైతం పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు న‌టుడు తార‌క్. త‌న కెరీర్ లో గొప్ప సినిమాగా దేవ‌ర నిలిచి పోతుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

త‌ను ఒక్క‌డే కాకుండా సినిమాలో మిగ‌తా టీమ్ కూడా అద్భుతంగా త‌మ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌హించార‌ని కొనియాడారు. ప్ర‌తి పాత్ర గుండెకు హ‌త్తుకునేలా ఉంటుంద‌ని పేర్కొన్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇప్ప‌టికే అంచ‌నాల‌కు మించి దేవ‌ర‌ను ఆద‌రిస్తున్నార‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు .

ఇక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు తార‌క్. ఎందుకంటే త‌ను అద్భుత‌మైన క్రియేటివిటీ క‌లిగిన ద‌ర్శ‌కుడ‌ని , నాలాంటి వాళ్లు దొరికితే అత‌డికి పండ‌గేన‌ని కొనియాడారు. మొత్తంగా సెప్టెంబ‌ర్ 27 కోసం యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంద‌ని, త‌ప్ప‌కుండా వంద శాతం ఫుల్ ఫిల్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు జూనియ‌ర్ ఎన్టీఆర్.