తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆందోళన
రాహుల్ గాంధీపై బీజేపీ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో నిరసన చేపట్టారు. తమ నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిదని, ఆయనను కామెంట్స్ చేసే స్థాయి భారతీయ జనతా పార్టీ నేతలకు లేదని పేర్కొన్నారు ఈ సందర్బంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే హక్కు, వ్యక్తం చేసే హక్కు ఉందని కానీ చంపుతామంటూ వార్నింగ్ ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వెంటనే బేషరతుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పనిగట్టుకుని బీజేపీ, దాని కూటమి పార్టీ నేతలు చేస్తున్న హింసాత్మక ప్రకటనలు చేయడం మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ పట్ల అనుచిత కామెంట్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు.